Skip to content

‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు దక్కింది – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

WhatsApp Image 2025-06-02 at 4.31.14 PM
d5bd2891-2f4e-4619-a27b-cfe9918f13d6
WhatsApp Image 2025-06-02 at 4.31.14 PM (1)

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ మీద రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో సోమవారం నాడు కల్చరల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘షష్టిపూర్తి’ అనేది కల్చరల్ బ్లాక్ బస్టర్ కాదు.. కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు దక్కింది. మీడియా, ఆడియెన్స్ వల్లే మా ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ స్థాయి వరకు వచ్చింది. థియేటర్లో అందరూ చూసి ఏడ్చేస్తున్నారంటేనే మేం సక్సెస్ అయినట్టు. ‘లేడీస్ టైలర్’లో నేను చాలా అల్లరి చేశాను. ‘ఆ నలుగురు’ చూసి నన్ను రఘురాం అని అన్నారు. అదే పాత్ర తాలుకా గొప్పదనం. మన కంటే మన పాత్రలే గుర్తుంటాయి అన్న ఎన్టీ రామారావు గారు చెబుతుంటారు. పవన్ ప్రభ నా మీద కథ రాసుకున్నారు. ‘లేడీస్ టైలర్’ తరువాత అర్చనను మళ్లీ ఇంత వరకు చూడలేదు. మాతో ఇలాంటి ఓ గొప్ప కథను, సినిమాను పవన్ ప్రభ చెప్పారు. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు. పవన్ కుమార్ అనే పేరుని అమ్మ చనిపోయాక ఆ పేరుని మార్చుకుని పవన్ ప్రభ అని పేరుగా పెట్టుకున్నారు. అమ్మ మీద అంత ప్రేమ ఉంది కాబట్టే ఇంత మంచి కథను రాసుకున్నారు.. అదే ఇప్పుడు కల్ట్ సినిమాగా మారింది. నాకు ‘షష్టిపూర్తి’ చేసి తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి.. ఎంతలా గౌరవించాలో, ప్రేమించాలో చూపించారు. ఇలాంటి చిత్రాలెన్నో ఇంకా రావాలి. విజయ వాహినీ, ఏవీఎం స్టూడియో వంటి ఎన్నో గొప్ప ప్రొడక్షన్ కంపెనీల్లో పని చేసిన అనుభవంతో నిర్మాతగా రూపేశ్ గొప్ప స్థాయికి వెళ్తాడని చెబుతున్నాను. ఇలాంటి అద్భుతమైన పాత్రలు నా చివరి శ్వాస వరకు చేయాలని కోరుకుంటూనే ఉంటున్నాను. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

హీరో, నిర్మాత రూపేశ్ మాట్లాడుతూ .. ‘‘షష్టిపూర్తి’ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు థాంక్స్. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే మంచి ఫీలింగ్ వస్తుంది. ఇళయరాజా గారి మ్యూజిక్, తోట తరణి గారి సెట్స్‌ను బిగ్ స్క్రీన్‌లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. కొత్త వారు చేసిన పాత్రల్ని కూడా ఆడియెన్స్ గుర్తు పెట్టుకుంటున్నారు. ఫ్యామిలీతో ఈ సినిమాను అందరూ చూడండి. ఈ రోజు ఇళయరాజా గారి పుట్టిన రోజు. మా టీం తరుపున ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారి సహకారంతోనే ఈ చిత్రంలో నటించాను. నా నటనకు మెచ్చుకుంటున్నారంటే వారే కారణం. పవన్ ప్రభ నాకు మంచి స్నేహితుడు. క్లైమాక్స్ చూసి చాలా మంది ఏడ్చేస్తున్నారు. మా సినిమాను చూడని వారంతా చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ .. ‘‘షష్టిపూర్తి’కి మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్‌తో మా సినిమా ముందుకు వెళ్తోంది. కుటుంబ విలువలు, ప్రేమ అనేది ప్రతీ ఒక్కరిలో ఉంటాయి. వాటినే నమ్ముకుని ఈ సినిమాను తీశాను. ఫస్ట్ హాఫ్‌లో రాజేంద్ర ప్రసాద్, అర్చన గార్ల నిడివి తక్కువ ఉందనే కంప్లైంట్ నా వరకు వచ్చింది. ఇది తల్లిదండ్రులతో పాటుగా ఓ కొడుకు కథ. మా సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు. మా చిత్రానికి మీడియా ఎంతగానో సపోర్ట్ అందిస్తోంది. ఇంకా చూడని వాళ్లంతా సినిమాను చూడండి. అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తే మా లాంటి దర్శకులు, రూపేశ్ లాంటి నిర్మాతలు ఇంకా ముందుకు వస్తారు’ అని అన్నారు.

లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘షష్టిపూర్తి’ చిత్రానికి సంబంధించిన ఇది సక్సెస్ మీట్ కాదు. ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులు, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పెట్టిన సభ. ఈ చిత్రం అద్భుతమైన ఓ ప్రయాణం. ఈ మూవీని చూసిన వారంతా గొప్పగా చెబుతున్నారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామని అంతా చెబుతున్నారు. పవన్ ప్రభ అద్భుతంగా కథను రాసుకున్నారు. పవన్ ప్రభ కన్న కలలను నిర్మాత, హీరో రూపేశ్ నిజం చేశారు. ఇలాంటి ఓ నిర్మాతను ఇంత వరకు నేను చూడలేదు. ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు మన అందరికీ దక్కిన ఆస్తి. ఆయన అద్భుతంగా నటించారు. ఇందులో అర్చన గారు, రాజేంద్ర ప్రసాద్ గారు విశ్వరూపం చూపించారు’ అని అన్నారు.

కెమెరామెన్ రామ్ మాట్లాడుతూ .. ‘‘షష్టిపూర్తి’ లాంటి మంచి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులు, మీడియాకి థాంక్స్. ‘అయ్యారే’ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు రాజేంద్ర ప్రసాద్ గారితో పని చేసే అవకాశం వచ్చింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. ఈ సక్సెస్ మీట్‌లో సినిమాలో నటించిన ఆర్టిస్టులు లతా, శ్వేతా, రూహి, అనుపమ, మహిరెడ్డి తదితరులు మాట్లాడారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.