Skip to content

‘వచ్చిన వాడు గౌతమ్’ బర్త్ డే పోస్టర్ రిలీజ్

‘వచ్చిన వాడు గౌతమ్’   బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్.

ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది.

ఆగస్ట్ 1 హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకి విషెష్ అందిస్తూ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.

ఇటివలే భారీ బడ్జెట్ తో హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. హై టెక్నాలజీని వాడి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ షూట్ చేశారు.

నిర్మాత గణపతి రెడ్డి ఎలాంటి రాజీ లేకుండా, పెద్ద చిత్రాలకు ఏమాత్రం తీసిపోని ప్రొడక్షన్‌ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, కీలక పాత్రలు పోహిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ. ఆయన విజువల్‌ ప్రెజెంటేషన్‌ ఈ క్లైమాక్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. చిత్రానికి గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు. M R వర్మా ఎడిటర్.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

నటీనటులు: అశ్విన్ బాబు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అభిత్ భూషణ్, నాగి, అభినయ, సాయి రోనక్, విద్యుల్లేఖ

సాంకేతిక నిపుణులు :
స్టోరీ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : మామిడాల ఎం. ఆర్. కృష్ణ
నిర్మాత : T. గణపతి రెడ్డి’
కో – ప్రొడ్యూసర్ : ప్రవల్లిక యోగి
లైన్ ప్రొడ్యూసర్ : T. బద్రి నాధ్ రెడ్డి
బ్యానర్ : అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్
డీవోపీ : ఎం. ఎన్ బాల్ రెడ్డి,
మ్యూజిక్ : గౌర హరి
ఎడిటింగ్ : M R వర్మా
ఫైట్స్ : పృథ్వి, రామకృష్ణ
ఆర్ట్ : సురేష్ భీమగని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : A.దుర్గేష్
కో – డైరెక్టర్ : U. కృష్ణ కిషోర్
పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను
పీఆర్వో : తేజస్వి సజ్జా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.