Skip to content

జనవరి 1న “వానర” సినిమా

జనవరి 1న  “వానర” సినిమా Telugu News

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వానర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి.

మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన “వానర” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “వానర” సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. టీజర్ కు 2 మిలియన్ ఫ్లస్ వ్యూస్ రాగా, రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

నటీనటులు – అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
ప్రొడక్షన్ డిజైనర్ – నార్ని శ్రీనివాస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – వివేక్ సాగర్
డైలాగ్స్ – సాయిమాధవ్ బుర్రా
స్టోరీ, స్క్రీన్ ప్లే – విశ్వజిత్
సమర్పణ – శంతను పత్తి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు – అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి
డైరెక్షన్ – అవినాష్ తిరువీధుల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.