Skip to content

రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ ‘పెద్ది’ గ్లింప్స్ రిలీజ్

రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్  ‘పెద్ది’  గ్లింప్స్ రిలీజ్ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ మేకర్స్ బర్త్ డే, శ్రీరామ నవమిని పురస్కరించుకుని అభిమానులకు ఒక పవర్‌ఫుల్ కానుకను అందించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ‘పెద్ది’ పెహల్వాన్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో గ్లింప్స్ మొదలౌతుంది. ఆ తర్వాత విజువల్స్ ఆడియన్స్ ని కుస్తీ పోటీలోకి తీసుకువెళ్తాయి. అక్కడ దుమ్ము, చెమట, సంకల్ప బలం ప్రతి ఫ్రేమ్‌లోనూ కట్టిపడేశాయి. కఠినమైన శిక్షణను తట్టుకుంటూ, ఇటుక గోడలను ఎక్కుతూ, ఇసుక సంచులను ఎత్తుతూ, అచంచలమైన సంకల్పంతో గదలో ప్రావీణ్యం సంపాదిస్తున్న పెద్ది పహిల్వాన్ ఎదుగుదల అద్భుతంగా వుంది.

రామ్ చరణ్ ట్రాన్స్ ఫర్మేషన్ మెస్మరైజింగ్ గా ఉంది. సిక్స్-ప్యాక్ అబ్స్, దృఢమైన కండరాలు, ఇంటెన్స్ ప్రజెన్స్ తో నిజమైన పహిల్వాన్‌గా ఒదిగిపోయారు. రామ్ చరణ్ గదను పట్టుకొని హనుమంతుడిలా కనిపించిన సన్నివేశం అద్భుతం, శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ఉత్సాహానికి సరిగ్గా సరిపోయేలా వుంది. “చూడుమే… ఆటే నా పోగరు…”అని చరణ్ పలికిన ఫైనల్ డైలాగ్ అదిరిపోయింది.

దర్శకుడు బుచ్చి బాబు సానా, రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపిస్తూ, గూస్ బంప్స్ ట్రీట్ ని అందించారు. ప్రతి ఫ్రేమ్ విజల్ వేసే ఎనర్జీతో సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.

టెక్నికల్ గా గ్లింప్స్ నెక్స్ట్ లెవల్ లో వుంది. ఆర్. రత్నవేలు కుస్తీ ప్రపంచంలోని ఇంటెన్స్సిటీని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ లీనమయ్యే విజువల్స్ అందించారు. అకాడమీ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను మరింత పెంచుతుంది. నవీన్ నూలి షార్ఫ్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా వున్నాయి. ఈ అగ్రశ్రేణి టెక్నికల్ టీం పనితీరుతో, నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండ్ గా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ ‘గ్లింప్స్’ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకగా నిలవడమే కాకుండా, ఒక ఫెరోషియస్ ఫోర్స్ ని సూచిస్తోంది. “పెద్ది పెహల్వాన్‌” వచ్చేశాడు… అతని గర్జన ఇప్పుడే ప్రారంభమైంది.

“పెద్ది” చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోందని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది.

నటీనటులు: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: బుచ్చి బాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణం (DOP): ఆర్. రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి. వై. ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.