Skip to content

‘కామాఖ్య’ నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ ‘సఖీ’ సాంగ్ రిలీజ్

‘కామాఖ్య’ నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ ‘సఖీ’ సాంగ్ రిలీజ్ Telugu News

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ కామాఖ్య మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ సఖీ పాటని రిలీజ్ చేశారు.
ట్యాలెంటెడ్ కంప్జర్ జ్ఞానీ ఈ పాటని ఎప్పటికీ నిలిచిపోయే ఫ్రెండ్షిఫ్ సాంగ్ గా స్వరపరిచారు. అనంత శ్రీరాం రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వున్నాయి. లక్ష్మీ మేఘన వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని జోడించింది.
లిరికల్ వీడియో ఆకట్టుకునే భావోద్వేగాలను, మ్యూజికల్ ట్రీట్ ని అందిస్తుంది.
ఈ చిత్రానికి రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీ, వరప్రసాద్ ఎడిటర్.
తారాగణం: సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య
కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ
బ్యానర్: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD
నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
DOP: రమేష్ కుశేందర్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్
సంగీతం: గ్యాని
ఎడిటర్: వరప్రసాద్
ఆర్ట్: భూపతి యాదగిరి
VFX: ఫణి విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్
పీఆర్వో: వంశీ శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.