Skip to content

‘పెద్ది’ మేనియా ప్రారంభం, దేశవ్యాప్తంగా ఎప్పుడూ చూడని వినూత్న ప్రచార కార్యక్రమం- పెద్ది పవర్‌ప్లే టూర్

‘పెద్ది’ మేనియా ప్రారంభం, దేశవ్యాప్తంగా ఎప్పుడూ చూడని వినూత్న ప్రచార కార్యక్రమం- పెద్ది పవర్‌ప్లే టూర్ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మచ్ అవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్‌తో చిత్రబృందం సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది.ఇప్పటికే విడుదలైన రెండు హై-వోల్టేజ్ పాటలు, రెండు విభిన్న గ్లింప్సెస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను టీమ్ ప్రారంభించింది.

‘పెద్ది పవర్‌ప్లే టూర్’ మే 18న ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో ప్రారంభం కానుంది. అన్ని ప్రధాన భాషల్లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ మరింత జోరందుకోనుంది. మే 22న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న SRH vs RCB మ్యాచ్ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకంగా హాజరుకానుండటం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అనంతరం మే 23న భోపాల్, మే 24న బెంగళూరు, మే 28న ఢిల్లీ, మే 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అంతేకాదు, సమ్మర్ అంతా హైప్ కొనసాగించేలా మరిన్ని సర్‌ప్రైజ్‌లు కూడా సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

“ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో సర్‌ప్రైజ్‌లు సిద్ధంగా ఉన్నాయి. మీకు అల్టిమేట్ సమ్మర్ ట్రీట్ అందించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. మీ హాలిడేస్‌ను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేందుకు జూన్ 4న ముందుగానే వస్తున్నాం. మా టీమ్ ప్రతి ఫ్రేమ్‌లో మనసు పెట్టి పని చేసింది. బిగ్ స్క్రీన్ పై మీరు ఈ అనుభూతిని ఆస్వాదించేందుకు మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం” అని మేకర్స్ తెలిపారు.

ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఈ భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచి ‘పెద్ది’ను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.