Skip to content

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 20న “డేవిడ్ రెడ్డి” మూవీ టీజర్ రిలీజ్

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 20న “డేవిడ్ రెడ్డి” మూవీ టీజర్ రిలీజ్ Telugu News

‘రా కింగ్’ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా “డేవిడ్ రెడ్డి”. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమా రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ నెల 20న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా “డేవిడ్ రెడ్డి” సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఇప్పటిదాకా రాకింగ్ స్టార్ గా పిలవబడుతున్న మంచు మనోజ్ ఇకపై రా కింగ్ మంచు మనోజ్ ట్యాగ్ తో మన ముందుకు రాబోతున్నారు. “డేవిడ్ రెడ్డి” టీజర్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా రూపొందుతున్న “డేవిడ్ రెడ్డి” చిత్రంలో మంచు మనోజ్ కొత్త అవతార్ లో కనిపించనున్నారు. ఇప్పటికే “డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మనోజ్ కు ఒక మంచి కమ్ బ్యాక్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని “డేవిడ్ రెడ్డి” సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు.

నటీనటులు – మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా, రమ్య కృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన, తదితరులు

టెక్నికల్ టీమ్
———————
ప్రొడ్యూసర్స్ – భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి
స్క్రిప్ట్, డైరెక్టర్ – హనుమారెడ్డి యక్కంటి
మ్యూజిక్ – రవి బస్రూర్
డీవోపీ – ఆచార్య వేణు
ఎడిటింగ్ – ఉజ్వల్ కులకర్ణి
ఆర్ట్ – తాళ్లూరి కృష్ణ మోహన్
యాక్షన్ – సుప్రీమ్ సుందర్, వింగ్ చున్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కొట్టు రవికుమార్
కాస్ట్యూమ్స్ – మానస నున్న

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.