Skip to content

చందానగర్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్

చందానగర్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్ Telugu News
చందానగర్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్ Telugu News

హైదరాబాద్: ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ ‘హబీబ్స్’ (Habibs) సరికొత్త ప్రీమియం సెలూన్ శాఖ హైదరాబాద్ లోని చందానగర్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమీన్‌పూర్ రోడ్, సురక్ష కాలనీ, పద్మజానగర్‌లోని సంజీవని డయాగ్నోస్టిక్స్ సెంటర్ పై అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ నూతన సెలూన్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి హిమజ విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సెలూన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవనశైలికి ఆకర్షణీయమైన రూపాన్ని అందించడంలో బ్యూటీ సెలూన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దేశంలోని పట్టణ మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాల వారికి అందం, అలంకరణ రంగంలో సేవలు అందిస్తున్న హబీబ్స్ సెలూన్ బ్రాండ్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. అధునాతన వసతులు, అనుభవజ్ఞులైన సిబ్బందితో ఈ సెలూన్ నగరవాసులకు అత్యుత్తమ సేవలు అందిస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తపరిచారు.

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ… ”బాచుపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్ స్థానికుల‌కు ఎంతో సౌక‌ర్యంగా ఉంటుందని భావిస్తున్నాను. బ్యూటీ అండ్ హెయిర్ కేర్ రంగంలో కస్టమర్లకు నాణ్య‌మైన సేవ‌లు అందిస్తూ వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవాల‌ని కోరుతున్నాను. ఈ కొత్త ప్రారంభోత్సవం సంద‌ర్భంగా ఫ్రాంచైజీ యజమానులకు అభినందనలు. హైదరాబాద్ న‌గ‌రం అంతటా బ్రాంచీల‌తో విస్తరిస్తున్న హబీబ్స్ ఫ్యామిలీకి నా శుభాకాంక్షలు” అని అన్నారు.

‘హబీబ్స్’ మేనేజింగ్ డైరెక్టర్ అమన్ హబీబ్ మాట్లాడుతూ.. “హబీబ్స్ అనేది జుట్టు, చర్మ సంరక్షణ సేవల రంగంలో ఒక పాన్-ఇండియా బ్రాండ్. ఇది పురుషులు, మహిళల‌కు స్టైలింగ్ స‌ర్వీసుల‌ను అందిస్తుంది” అని అన్నారు. “హెయిర్ ఫార్మ్స్, హెయిర్ కలరింగ్‌తో పాటు, పెళ్లికూతురి మేకప్‌ను మెరుగుపరచడం, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, ఫేషియల్, రిఫ్లెక్సాలజీ చికిత్స సేవల వంటి అలంకరణ సేవలను కూడా అందిస్తున్నాము” అని ఆయన తెలిపారు.

‘హబీబ్స్’ చందానగర్‌ బ్రాంచీ నిర్వ‌హ‌కులు శాలి మిత్ర (ShaLi Mithra) మాట్లాడుతూ.. త‌మ బ్రాంచీని ఆవిష్క‌రించిన‌ ముఖ్య అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాము అందించే సేవ‌ల వివ‌రాలు తెలిపారు.

Habib’s Master Franchise నిర్వాహకులు ప్రశాంత్ లడ్డా, శ్రీకాంత్ రాఠీ మాట్లాడుతూ, వినియోగదారులకు స‌ర‌స‌మైన ధరలకే అత్యున్నత స్థాయి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, మార్చి 2027 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 20కి పైగా Habib’s సెలూన్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని తమ సంస్థ యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హస్తినాపురం, కొంపల్లితో పాటు, వరంగల్ నగరంలోనూ త్వరలోనే కొత్త సెలూన్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో పలువురు ప్రముఖులు, స్థానికులు, సెలూన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.