Skip to content

నందు నటించిన ‘అగ్లీ స్టోరీ’ మే 22న విడుదల.. ప్రజల్లో జోరుగా ప్రమోషన్స్

నందు నటించిన ‘అగ్లీ స్టోరీ’ మే 22న విడుదల.. ప్రజల్లో జోరుగా ప్రమోషన్స్ Telugu News
నందు నటించిన ‘అగ్లీ స్టోరీ’ మే 22న విడుదల.. ప్రజల్లో జోరుగా ప్రమోషన్స్ Telugu News

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రణవ స్వరూప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. రియా జియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉండేలా సూచిస్తున్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ విభిన్నంగా ఉన్నాయి. నందు సందడి మాములుగా లేదనే చెప్పాలి. ప్రజల వద్దకే ప్రమోషన్స్ అంటూ నందు చేస్తున్న హంగామా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంది. బ్లింకిట్ డెలివరీ బాయ్ గెటప్ లో నందు చేసిన ప్రమోషన్ బాగా వైరల్ అవుతుంది. అలాగే మార్కెట్లో కూరగాయలు అమ్మే వ్యక్తిగా కూడా నందు హల్ చల్ చేశాడు. మొత్తానికి నందు ప్రమోషన్స్ ఈ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లాయి. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.