Skip to content

శరవేగంగా సాగుతున్న ‘నాగబంధం’ పోస్ట్-ప్రొడక్షన్ పనులు – హిందీ రైట్స్ ను కొనుగోలు చేసిన జీ స్టూడియోస్

శరవేగంగా సాగుతున్న ‘నాగబంధం’ పోస్ట్-ప్రొడక్షన్ పనులు  – హిందీ రైట్స్ ను కొనుగోలు చేసిన జీ స్టూడియోస్ Telugu News

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్-అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ప్రతి ప్రమోషనల్ అప్డేట్‌తో దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. భారతీయ పురాణాలు, అడ్వెంచర్, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తులు, హై-ఆక్టేన్ యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వర్షం, చీకటి, అగ్నిజ్వాలల మధ్య విరాట్ కర్ణ కనిపించిన తీరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆయన చేతిపై పడగ విప్పిన విషసర్పం, మరో చేతిలో కత్తి, నేపథ్యంలో కనిపించే సముద్ర యుద్ధ వాతావరణం, ట్రైబల్ పోరాటాలు, మెరుపులు, అగ్నిజ్వాలలు కలిసి చిత్రంలోని భారీ స్థాయి యాక్షన్‌ను సూచిస్తున్నాయి. ఈ పోస్టర్ సినిమాకి ఉన్న విజువల్ గ్రాండియర్‌ను మరోసారి చాటిచెప్పింది.

ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన యాక్షన్ డైరెక్టర్ వ్లాడ్ రింబర్గ్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. భారీ ట్రైబల్ యుద్ధాలు, సముద్ర పోరాటాలు, నీటి అడుగున జరిగే యాక్షన్ ఎపిసోడ్లు, ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో చూడని అడ్వెంచర్ సెట్‌పీసులు ఈ చిత్రంలో ఉండనున్నాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలు ఈ చిత్రానికి పని చేస్తున్నాయి. ప్రాచీన దేవాలయాలు, మిస్టికల్ ప్రపంచాలు, భారీ యుద్ధ ఘట్టాలు, దైవిక శక్తులతో కూడిన సన్నివేశాలను అత్యాధునిక సాంకేతికతతో తెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం కృషి చేస్తోంది. ప్రపంచ స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేలా ప్రతి ఫ్రేమ్‌ను తీర్చిదిద్దుతున్నారు.

ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికే ‘నాగబంధం’ను ఇటీవలి కాలంలో భారతీయ సినిమా నుంచి రాబోతున్న అతిపెద్ద విజువల్ స్పెక్టకల్స్‌లో ఒకటిగా అభివర్ణిస్తున్నాయి.

ఇక తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కులను ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. హిందీ మార్కెట్‌లో భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ భాగస్వామ్యం ‘నాగబంధం’కు దేశవ్యాప్తంగా మరింత చేరువ చేయనుంది.

అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, రిషబ్ సావ్నే తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో మైథలాజికల్ అడ్వెంచర్ జానర్‌కు కొత్త నిర్వచనం ఇవ్వనుంది,

భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరిత యాక్షన్ ఘట్టాలు, అడ్వెంచర్ ఎపిసోడ్లు, పవర్ ఫుల్ మ్యూజిక్, ఆసక్తికరమైన కథాంశంతో ‘నాగబంధం’ 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథాలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ నాగబంధం 44 రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది.

జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.