Skip to content

జూలై 23న ‘జ‌న నాయ‌గ‌న్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం ‘జ‌న నాయ‌గ‌న్‌’. ఇది ఆయ‌న చివ‌రి చిత్రం. ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 23, 2026న‌ గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

భారతదేశంలో సినీ ప్రేమికులంద‌రూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘జన నాయగ‌న్‌’ ఒక‌టి. ద‌ళ‌ప‌తి విజ‌య్ అద్బుత‌మైన సినీ ప్ర‌యాణంలో ఇదొక కీల‌క‌మైన మైలు రాయిగా నిల‌వ‌నుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన చివరి సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ఆయన కెరీర్‌కు ఈ చిత్రం సరైన నివాళిగా నిలుస్తుందని అంద‌రూ భావిస్తున్నారు.

హెచ్‌.వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో రూపొందిన‌ ‘జన నాయగ‌న్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు ప్రతిభావంతమైన టీమ్‌ను ఒకేచోట చేర్చింది. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ మాట్లాడుతూ ..“సినిమా చరిత్రలో నిజంగా చారిత్రాత్మకంగా అనిపించే క్షణాలు చాలా అరుదు. ‘జన నాయగన్’ కూడా అలాంటి ప్రత్యేకమైన క్షణం. దళపతి విజయ్ తన చివరి సినిమాతో సిల్వర్ స్క్రీన్పై సందడి చేయనున్నారు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాం. ఈ ప్రత్యేక చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల ముందుకు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. సినీ ఇండస్ట్రీలో ప్రారంభమైన ఆయన ప్రయాణం లక్షలాది మందికి ప్రేరణగా మారి..చివరికి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగారు. ప్రజలతో ఆయనకు ఉన్న అపూర్వమైన అనుబంధానికి ఇది నిదర్శనం. ‘జన నాయగ‌న్’ ప్రేక్ష‌కుల‌కు ఒక గుర్తుండిపోయే థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తూ, ఆయన అద్భుతమైన కెరీర్‌కు సరైన నివాళిగా నిలుస్తుందని మేము నమ్ముతున్నాం” అన్నారు.

ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ఈ ఏడాది అత్యంత భారీ సినిమాటిక్ ఈవెంట్స్‌లో ఒకటిగా నిలవబోయే ‘జన నాయగ‌న్’కు రంగం సిద్ధమైంది. అభిమానులు, ప్రేక్షకులు అందరూ ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా చివరి అధ్యాయాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూడడానికి ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ‘జ‌న నాయ‌గ‌న్‌’ మూవీ జూలై 23, 2026న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.