Skip to content

“మాయలేడి” మూవీ గ్లింప్స్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే “మాయలేడి” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “మాయలేడి” సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే – ‘హీరోయిన్ గురించి తెలుసుకున్నా కొద్దీ ఆమె పట్ల హీరోలో మరింత ఆసక్తి పెరుగుతుంటుంది. ఆ అమ్మాయి గురించి తెలిసే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ జంట లవ్ ప్రపోజ్ చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో హీరోయిన్ గురించి కొత్త కొత్త విషయాలు తెసుకుంటాడు హీరో. ‘తమ మధ్యకు ఎవరైనా వస్తే ఊరుకోనంటూ..’ హీరోయిన్ యాక్షన్ తో సత్తా చూపిస్తుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కలిసి తమ శత్రువులతో ఫైట్ చేయడం గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. గ్లింప్స్ చివరలో హీరో చెప్పిన ‘ఇప్పుడు నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తోంది..’ అనే డైలాగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ లో హీరో రాకేష్ వర్రే ఫ్రెష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. లవ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన పర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు. హీరోగా, ప్రొడ్యూసర్ గా రాకేష్ వర్రేకు ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ మూవీ కాబోతుందనే అంచనాలు గ్లింప్స్ తో ఏర్పడుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ‘నిన్ను చూసినాక ఈ క్షణం..’ పాట గ్లింప్స్ ఫీల్ ను మరింత పెంచింది. మొత్తంగా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ను గ్లింప్స్ క్రియేట్ చేసింది.

నటీనటులు -రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు

టెక్నీషియన్స్
——————–
మ్యూజిక్ – విశాల్ చంద్రశేఖర్
బ్యానర్ – క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ – రాకేష్ వర్రే
స్క్రిప్ట్, డైరెక్షన్ – ప్రశంకర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.