Skip to content

‘మిస్సింగ్ మేఘన’ మూవీ పోస్టర్ లాంచ్

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం “మిస్సింగ్ మేఘన”. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గారి చేతుల మీదుగా జరిగింది. శామ్.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్.ధృవన్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం తో పాటు బెక్కం వేణుగోపాల్ గారు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గారు మాట్లాడుతూ: బెక్కం వేణుగోపాల్ గారు, శ్రీనివాస్ గారి సపోర్ట్ తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమాతో హీరో రామ్ కార్తీక్ కి దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను. అదే విధంగా ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్ పాటలు రాస్తాడు, మ్యూజిక్ చేస్తాడు అతడికి ఈ సినిమాతో మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఈ టీం కి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ: వి.వి.వినాయక్ గారిది గోల్డెన్ హ్యాండ్ ఆయన మా సినిమా టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీడియాతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకి మీడియా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ: ముందుగా వి.వి.వినాయక్ గారికి మా టీం తరఫునుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది అని ఆశిస్తున్నాను.

సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ మాట్లాడుతూ: లెజెండ్రీ డైరెక్టర్ వి.వి.వినాయక్ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి మ్యూజిషియన్ కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా కి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మా టీం ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

క్యాస్ట్: రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు

టెక్నీకల్ టీం:
ప్రొడ్యూసర్: పంచుమర్తి నరేష్ బాబు
కో-ప్రొడ్యూసర్: దివెళా శ్రీనివాస్ రావ్
బ్యానర్ నేమ్స్: ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో
దర్శకత్వం: వాచస్పతి
కథ & స్క్రీన్‌ప్లే: వనరాజ్
సంభాషణలు: వెంకట్ బద్దిగం
సంగీతం: ఆర్.ఆర్.ధృవన్
ఛాయాగ్రహణం: శామ్. కె. నాయుడు
ఎడిటింగ్: బసవా
కొరియోగ్రాఫర్: జేడీ, ఈశ్వర్ పెంటి
ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్
లిరిక్స్: ఆర్.ఆర్. ధృవన్, అలరాజు
పిఆర్వో: సోమిశెట్టి నాగేశ్వర రావ్ (SNR), తిరుమలశెట్టి వెంకటేష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.