Skip to content

కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్ లాంచ్

▪️సోష‌ల్ మీడియాలో లాంచ్ చేసిన బ్రహ్మాజీ
▪️ భక్తిరస చిత్రంలో మార్కండేయుడిగా బ్రహ్మాజీ
▪️ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ‘కృష్ణంభ‌జే’ మూవీ

హైదరాబాద్‌: జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు.

పోస్ట‌ర్‌లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రంలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా ప్రదీష్, హీరోయిన్‌గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన సంభాషణలను రచ్చ రవి అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘కృష్ణంభజే’కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

నిర్మాత: కలాల్ శ్రీనివాస్
సహ నిర్మాత: శ్రీరాం గుప్త
ద‌ర్శ‌కత్వం: నాగరాజ్ కొట్టే
సినిమాటోగ్రఫీ: . రాము సి.ఎం – సూర్య మీసాల
సంగీతం: మంథెన త్రినాథ్ – సత్య సొమేష్
ఎడిటర్‌: జి. రాకేష్ గౌడ్
కొరియోగ్రఫీ: ఏ.ఆర్. బాబు – బాలకృష్ణ
ఫైట్స్‌: రవితేజ
ప‌బ్లిసిటీ డిజైన‌ర్: వివరెడ్డి
పీఆర్ఓ: అశోక్ ద‌య్యాల‌

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.