సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్…
కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన కొణిదెల తమ ముగ్గురు చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో తమ చిన్నారులను ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి కృష్ణుడు, రాధారాణి కొణిదెల వారి ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా ఉన్న ఈ అందమైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఆకట్టుకునే ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ..”చిరంజీవి గారి ఇంట్లోకి చిన్నారి కృష్ణుడు అడుగుపెట్టాడు 🦚💙” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వారికి ఒక బాబు, ఒక పాప జన్మించారు. బాబుకి శివరామ్, పాపకి అన్వీరా అని పేరు పెట్టారు.

