Skip to content

“ప్రతిరూపం” తెలుగులోనూ పెద్ద విజయం సాధించాలి!!

  • ప్రి-రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హీరోయిన్ కె.దివ్యవాణి చౌదరి

శ్రీ వినాయక వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై ఎస్. నరేష్ దర్శకత్వంలో శ్రీమతి బి. కళావతి కన్నడలో నిర్మించిన చిత్రం “ఇనియన్ ఆత్మ”. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో “ప్రతిరూపం” పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రి-రిలీజ్ వేడుకకు ప్రముఖ నటీమణి కె.దివ్యవాణి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు చిత్రబృందం మొత్తం బెంగుళూరు నుంచి తరలివచ్చింది.

చిత్ర నిర్మాత శ్రీమతి బి. కళావతి, చిత్ర దర్శకుడు నరేష్, ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన బి.సుస్మిత, “రేణుక-ఎల్లమ్మ” సీరియల్ ఫేమ్ అనన్య వి.ఎస్., నయన, మధుశ్రీ, మంత్రవాది ఆది, రవి కిరణ్, కిట్టు ఈ వేడుకలో పాల్గొని, తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.

కన్నడ సినిమా రంగంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆత్మీయంగా నెమరువేసుకుని, చిత్రబృందంతో కన్నడలో అనర్గళంగా మాట్లాడిన దివ్యవాణి… “ప్రతిరూపం” చిత్రం తెలుగులో పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిధులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ మాట్లాడుతూ… “తెలుగు ప్రేక్షకులకు భాషాభేదం ఉండదని, కంటెంట్ బాగుంటే బ్రహ్మరథం పడతారని పేర్కొన్నారు. అతిథులకు చిత్రబృందానికి నిర్మాత శ్రీమతి బి.కళావతి కృతజ్ఞత తెలిపారు. త్వరలో తెలుగులో స్ట్రెయిట్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు!!

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.