Skip to content

‘ది ఇండియా స్టోరి’ జూలై 24న రిలీజ్

  • MOVIES
  • Vishwanath
‘ది ఇండియా స్టోరి’ జూలై 24న రిలీజ్ Telugu News
‘ది ఇండియా స్టోరి’ జూలై 24న రిలీజ్ Telugu News
‘ది ఇండియా స్టోరి’ జూలై 24న రిలీజ్ Telugu News
‘ది ఇండియా స్టోరి’ జూలై 24న రిలీజ్ Telugu News

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే నటించిన గ్రిప్పింగ్ సోషియో-నేషనల్ డ్రామా ‘ది ఇండియా స్టోరి’ జూలై 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. చేత్తన్ డీకే దర్శకత్వంలో, సాగర్ బి షిండే నిర్మించి రచించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభావం చూపే సమకాలీన అంశాలతో రూపొందించారు.

‘ది ఇండియా స్టోరి’ ( ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్) ప్రధానంగా రసాయనాల దుర్వినియోగం, పురుగుమందుల సాగు, సంబంధిత కుంభకోణాల నేపథ్యంలోని కథ. ఒక కుటుంబం ఎదుర్కొనే కష్టాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పెద్ద సంక్షోభాన్ని ఈ కథ చూపించబోతోంది. సిస్టమ్‌లోని లోపాలు, కఠినమైన నియంత్రణల అవసరం వంటి అంశాలను కూడా ఈ చిత్రంలో ఇంపాక్ట్ ఫుల్ గా వుంటాయి.

ఈ చిత్రం గురించి నిర్మాత సాగర్ బి షిండే మాట్లాడుతూ.. “ఇది మన దేశంలో చాలా మందిని ప్రభావితం చేస్తున్న వాస్తవ సమస్య. రసాయనాల దుర్వినియోగం కేవలం పర్యావరణ సమస్య కాదు, అది మానవ సంక్షోభం. ఈ సినిమా ద్వారా అవగాహన కలిగించి, బాధ్యతపై చర్చలు ప్రారంభించాలనుకుంటున్నాం.

దర్శకుడు చేత్తన్ డీకే మాట్లాడుతూ.. ఈ కథను నిజాయితీగా చూపించేందుకు టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారు. కాజల్, శ్రేయస్ ఇద్దరూ తమ పాత్రలను ఎంతో నిబద్ధతతో పోషించారు. వారి నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది. వినోదంతో పాటు ప్రభావవంతమైన కథనాన్ని అందించడానికి ప్రయత్నించాం”

విభిన్న పాత్రలను పోషిస్తున్న కాజల్ అగర్వాల్, వెర్సటైల్ నటుడు శ్రేయస్ తల్పడే తొలిసారిగా సరికొత్త ఆన్-స్క్రీన్ జోడీగా కలిసి నటిస్తున్నారు. ఆలోచింపజేసే ఈ కథనానికి వారిద్దరి కాంబినేషన్ మరింత ఎమోషనల్ డెప్త్ అందించబోతుంది.

నేటి ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలని ఇష్టపడుతున్న సమయంలో ‘ది ఇండియా స్టోరి’ ఒక ప్రభావవంతమైన, సమయోచిత చిత్రంగా నిలవబోతోంది. బలమైన సందేశం, ఆకట్టుకునే కథాంశంతో పాటు ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే తో రూపుదిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి సుమిత్ బగాడే, అనితా జాదవ్, వినాయక్ సైదానీ, కల్పేష్ షా, దేవయాని ఖోరటే, ప్రేమ్ జోషి సహ-నిర్మాతల. డీఓపీ నిశాంత్ భగవత్, సంగీత దర్శకుడు మంగేష్ ధక్డే, ఎడిటర్ ఆశిష్ మహాత్రే, గీత రచయిత షకీల్ అజామీ, సౌండ్ డిజైనర్ అన్మోల్ భావేల పనితీరుతో ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి చేరింది.

ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుంది.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.