కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘’ది ఇండియా స్టోరి’ టీజర్ త్వరలో విడుదల
జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ & స్టూడియోస్ సమర్పణ ఆకట్టుకునే పోస్టర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరి’ మేకర్స్ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషియో-నేషనల్ డ్రామా టీజర్ త్వరలో విడుదల కానుందని ప్రకటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చెట్టన్ డీకే దర్శకత్వంలో, సాగర్ బి షిండే రచించి నిర్మిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పొయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ రసాయనాల దుర్వినియోగం, ముఖ్యంగా పురుగుమందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకుని…
