Skip to content

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘’ది ఇండియా స్టోరి’ టీజర్ త్వరలో విడుదల

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘’ది ఇండియా స్టోరి’ టీజర్ త్వరలో విడుదల Telugu News

జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ & స్టూడియోస్ సమర్పణ

ఆకట్టుకునే పోస్టర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరి’ మేకర్స్ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషియో-నేషనల్ డ్రామా టీజర్ త్వరలో విడుదల కానుందని ప్రకటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

చెట్టన్ డీకే దర్శకత్వంలో, సాగర్ బి షిండే రచించి నిర్మిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పొయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ రసాయనాల దుర్వినియోగం, ముఖ్యంగా పురుగుమందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్ ఈ చిత్రంలోని తీవ్రమైన, ఆలోచింపజేసే అంశంపై ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది.

ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబ కథను దాటి, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న సామాజిక సంక్షోభాన్ని ఈ చిత్రం ప్రతిబింబించనుంది. పరిశ్రమల నిర్లక్ష్యం, దాని వల్ల దాగి ఉన్న ప్రమాదాలు, సమాజంలో అవగాహన, బాధ్యత ఎంత అవసరమో ఈ కథ ద్వారా చూపించబోతున్నారు.

త్వరలో రానున్న టీజర్ ప్రేక్షకులను ‘ది ఇండియా స్టోరీ’ ప్రపంచంలోకి మరింతగా తీసుకెళ్తుందని మేకర్స్ తెలిపారు. తొలిసారి కలిసి నటిస్తున్న కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే తమ ఎమోషనల్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో కథకు మరింత బలం తీసుకురానున్నారు.

సుమిత్ బగాడే, అనితా జాధవ్, వినాయక్ సైదాని, కల్పేష్ షా, దేవ్యాని ఖోరాటే, ప్రేమ్ జోషి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ నిశాంత్ భగవత్, సంగీత దర్శకుడు మంగేష్ ధక్డే, ఎడిటర్ ఆశిష్ మాథ్రే, లిరిసిస్ట్ షకీల్ అజ్మీ, సౌండ్ డిజైనర్ అన్మోల్ భావే పని చేస్తున్నారు.

హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. జీ స్టూడియోస్ వరల్డ్‌వైడ్ రిలీజ్‌గా ‘ది ఇండియా స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.