Skip to content

సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ #NBK112 అనౌన్స్‌మెంట్

సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ #NBK112 అనౌన్స్‌మెంట్ Telugu News

ప్రస్తుతం #NBK111 చిత్రీకరణలో ఉన్న గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి ప్రాజెక్ట్‌ #NBK112 ను అధికారికంగా ప్రకటించారు. #NBK112కు సెన్సేషనల్ దర్శకుడు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.

హై వోల్టేజ్ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ, బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయేలా ఒక బలమైన కథను సిద్ధం చేశారు. పోస్టర్‌పై కనిపించిన “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే ట్యాగ్‌లైన్ సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచిస్తోంది.

డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

నిర్మాత, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: కొరటాల శివ
పీఆర్‌ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్‌షో