Skip to content

‘సిస్టం’ మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్

‘సిస్టం’ మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ Telugu News

ఇండియాలో కోర్ట్ రూం డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కోర్ట్‌రూం థ్రిల్లర్‌లను ఇష్టపడే ఆడియెన్స్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇక అమెజాన్ ప్రైమ్‌లో మే 22 నుంచి ఓ అద్భుతమైన కోర్ట్ రూం థ్రిల్లర్ ‘సిస్టం’ స్ట్రీమింగ్ కాబోతోంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మన్ బావేజా, పమ్మి బావేజా, స్మిత బలిగా నిర్మాతలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రత్యేక హక్కులు, సత్యం, న్యాయం నిజమైన అర్థాన్ని ప్రశ్నించే తీవ్రమైన కథనంతో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రసారం కానుంది.

‘సిస్టం’ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారు. అంతే కాకుండా ప్రీతి అగర్వాల్, ఆదినాథ్ కొఠారే, ఆశ్రియా మిశ్రా, గౌరవ్ పాండే, సయన్‌దీప్ గుప్తా తదితరులు ఇతర పాత్రలను పోషించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహా రాజవంశ్, నిరాడంబరమైన స్టెనోగ్రాఫర్ సారిక రావత్‌ల మధ్య జరిగే సంభాషణలు, వారి ఊహించని స్నేహం, వారు పనిచేస్తున్న వ్యవస్థనే సవాలు చేస్తూ, అణచివేయబడిన అన్యాయాలను వెలికితీయడానికి దారితీస్తుంది.

హర్మన్ బావేజా, అరుణ్ సుకుమార్, అశ్విని అయ్యర్ తివారీ, తస్నీమ్ లోఖండ్వాలా, అక్షత్ గిల్డియాల్ రచించిన ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగుతూనే, న్యాయపరమైన నాటకంతో మేళవించి, ఆలోచింపజేసేలా ఉంటుంది. ఆశయం, నైతికత, సత్యం వంటి ఇతివృత్తాలను ప్రధానంగా కలిగిన ‘సిస్టం’ మే 22న ప్రైమ్ వీడియో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.