Skip to content

‘నాగబంధం’ నార్త్ ఇండియాలో జూలై 3న జీ స్టూడియోస్ ద్వారా గ్రాండ్ రిలీజ్

‘నాగబంధం’ నార్త్ ఇండియాలో జూలై 3న జీ స్టూడియోస్ ద్వారా గ్రాండ్ రిలీజ్ Telugu News
‘నాగబంధం’ నార్త్ ఇండియాలో జూలై 3న జీ స్టూడియోస్ ద్వారా గ్రాండ్ రిలీజ్ Telugu News

అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ పార్ట్నర్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ చేతులు కలిపింది. ఎపిక్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ‘నాగబంధం’ను నార్త్ ఇండియాలో అన్ని భాషల్లో జీ స్టూడియోస్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘నాగబంధం’ పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’ జూలై 3న విడుదల కానుంది.