మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే…
ప్రభాస్ గారు ..మా “స్పిరిట్” సినిమా మీరే విడుదల చేయాలి – రైతు, మహిళా నిర్మాత నర్సమ్మ
ఒక మహిళా నిర్మాత తన 50 ఏళ్ల కళ సినిమా తియ్యాలి అని ఛాలెంజ్ గా తీసుకుని నెరవేర్చుకుని ఆ కళ ని “స్పిరిట్” ఇస్ నాట్ వన్, సినిమా తీసి మే 29 విడుదలకు రెడీ చేసుకుంటే టీ-సిరీస్ శ్రీ భూషణ్ కుమార్ లీగల్ నోటిస్ మా ఇంటికి పంపించడం వల్ల ఇప్పుడు మా ఊరిలో పరువు పోయింది అప్పు పుట్టడం లేదు అప్పు ఇస్తాను అనేవాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వకపోగా ప్రభాస్ ప్రొడ్యూసర్స్ నోటీసులు ఎందుకు పంపిస్తారు డబ్బులు ఎక్కోట్టడానికే ఇవన్ని చేస్తున్నారు అని అవమానంగా మాట్లాడారు నా ఊరిలో పరువు పోయింది డిస్టబ్యూటర్స్ కూడా విడుదల చెయ్యము అనీ చెప్పేసారు. మా చిన్న సినిమాకి పాన్ ఇండియా బిగ్గెస్ట్ హీరో భాస్ ప్రొడ్యూసర్ టీ-సిరీస్ నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి సినిమా తీయాలనే కలతో, గొర్రెలు, మేకలు, ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి ఎన్నో ఏళ్ల కష్టంతో సినిమా నిర్మించము మాలాంటి వాళ్లకి సపోర్ట్ చెయ్యాల్సింది పోయి ఎదురు సినిమా విడుదల ఆపేసారు అని తెలిపారు.
తన సినిమా టైటిల్‌పై అభ్యంతరం చెబుతూ పెద్ద నిర్మాణ సంస్థ నుంచి నోటీసులు వచ్చాయని, దీంతో సినిమా రిలీజ్ ఆగిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఇప్పటికే సెన్సార్ పూర్తయి, ప్రచారం కూడా చేసిన తర్వాత ఇలా చేయడం అన్యాయమని వాపోయారు.
మా స్పిరిట్ సినిమా పేరు మూడేళ్ల గా ఏదొక మీడియా లో ఇంటర్వ్యూ లు ఇంటర్వూస్ ఇచ్చాము ఇన్ని రోజులు ప్రమోషన్ చేస్తున్నాము, ఇప్పుడు విడుదల సమయానికి మాత్రమే అభ్యంతరం చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలియాలి అన్నారు మమ్మల్ని అడిగితె టైటిల్ కూడా ప్రభాస్ గారి కోసం టైటిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాని మమ్మల్ని ఎవరు సంప్రదించిన టైటిల్ ఇచ్చేవాళ్ళం అని నిర్మాత నరసమ్మ తెలిపారు.
అసలు ఎవరు నా సినిమా రిలీజ్ ఆపింది
అయినకి ఎందుకు మా సినిమా మీద నోటీసులు పంపించారు.చిన్న సినిమాలు తీయకూడదనే నిబంధన ఎక్కడా లేదని, పెద్ద సంస్థలు చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు.
అవసరమైతే కోర్టుకు వెళ్లి పోరాడతానని, తన సినిమా విడుదలయ్యే వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అలాగే మా సినిమా విడుదలకి మాకు అప్పు కూడా ఎవ్వరు ఇవ్వరు మేము మా సినిమా ని విడుదల చేయలేము మా సినిమాని ప్రభాస్ గారు విడుదల చేసి మాకు న్యాయం చెయ్యాలి వాళ్ల సినిమా విడుదల వరకు ఆగి ఆ ప్రభాస్ గారి సినిమా మీద మేము కూడా నోటీసులు సినిమా ఆపిస్తాము అప్పకపోతే అదే సినిమా ఆఫీస్ ముందు మా ఫ్యామిలీ ఏమి చేసుకుంటామో అప్పుడు తెలుస్తుంది.
మా సినిమా “స్పిరిట్ ఇస్ నాట్ వన్” సినిమా మీరు ఆపేసారు మీరే మా సినిమా ని మీరే విడుదల చెయ్యాలి అని కోరుకుంటున్నాము ఈ విషయంపై హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

