Skip to content

ఈ నెల 11న హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ క్రేజీ మూవీ “తమ్ముడు” ట్రైలర్ రిలీజ్, జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

thammudu1
thammudu

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు “తమ్ముడు” సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు క్రియేటివ్ గా, ఎంటర్ టైనింగ్ వీడియోతో తెలిపారు.

“తమ్ముడు” మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ వీడియో ఫన్నీగా డిజైన్ చేశారు. తాను గట్టిగా అడిగినందు వల్లే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారని, ట్రైలర్ రిలీజ్ చేయమని అడిగితే చేస్తారని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పగా, తాను అడిగితేనే మూవీ రిలీజ్ డేట్ చెప్పారని లయ అంటుంది. వీళ్లిద్దరితో పోటీ పడుతూ స్వసిక విజయన్, సప్తమి గౌడ, బేబి శ్రీరామ్ దీత్య తాము చెప్పడం వల్లే “తమ్ముడు” మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారని అంటారు. ఇలా వీళ్లు గొడవ పడుతుండగా, దర్శకుడు శ్రీరామ్ వేణు వచ్చి ‘మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే ట్రైలర్ చూడండి.’ అని చెప్తాడు. ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇలా సరికొత్తగా డిజైన్ చేయడం మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో “తమ్ముడు” సినిమా వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను “తమ్ముడు” సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.