Skip to content

ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా విడుదల.. కాలేజీ స్టూడెంట్స్ నడుమ అట్టహాసంగా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా విడుదల.. కాలేజీ స్టూడెంట్స్ నడుమ అట్టహాసంగా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ Telugu News

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్ లో నిర్వహించారు. స్టూడెంట్ తో డాన్సులు చేసిన హీరో హీరోయిన్.. ఆపై ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించి అందరిలో జోష్ నింపారు.

ఈ సందర్భంగా హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ .. ”మా సినిమా ప్రమోషన్స్ ఈ కాలేజీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న బారాబర్ ప్రేమిస్తా సినిమాతో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నా. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని చెబుతూ

హీరోయిన్ మేఘన ముఖర్జీ మాట్లాడుతూ .. ”అందరికీ థ్యాంక్స్. ఫిబ్రవరి 6న బారాబర్ ప్రేమిస్తా సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నా” అన్నారు.

డైరెక్టర్ సంపత్ రుద్ర మాట్లాడుతూ .. ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేదే మా బారాబర్ ప్రేమిస్తా సినిమా. ఇది ప్యూర్ తెలంగాణ బ్యాక్ ఓవర్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. ఫిబ్రవరి 6న అందరూ చూసేయండి అన్నారు.

ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

నటీనటులు : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు

సాంకేతిక వర్గం

బ్యానర్ : సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్
నిర్మాతలు : గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్
డైరెక్టర్ : సంపత్ రుద్ర
స్క్రీన్ ప్లే : సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి
కథ : ఎంఏ తిరుపతి
డైలాగ్స్:రమేష్ రాయ్
డీవోపీ :వైఆర్ శేఖర్
మ్యూజిక్ : ఆర్ఆర్ ద్రువన్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
పీఆర్ఓ : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.