Skip to content

గోదారి గట్టుపైన మూవీ నుంచి ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్

గోదారి గట్టుపైన మూవీ నుంచి  ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్ Telugu News

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి హార్ట్ బ్రేక్ యాంథమ్ ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. వాలెంటైన్ డే సెలబ్రేషన్ కి ఇది పర్ఫెక్ట్ ట్రీట్ గా ఉండబోతుంది.

ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ, నాగ వంశీ కృష్ణ సంగీతం, ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రవాళ్య, ఎడిటర్‌గా అనిల్ కుమార్ పి పని చేస్తున్నారు.

యూత్‌ఫుల్ ఎనర్జీ, రూటెడ్ విజువల్స్, గోదారి గట్టుపైన స్నేహం, ప్రేమని సెలబ్రేట్ చేసుకునే ఫీల్-గుడ్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులని అలరించనుంది.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత – అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
DOP – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. We covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.