గోదారి గట్టుపైన’ నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది – హీరో సుమంత్ ప్రభాస్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. థ్యాంక్స్ మీట్లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా కంటెంట్‌ను ఎంతో స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. మూడేళ్ల తర్వాత నా సినిమా వస్తోంది. ‘ఎవరైనా టికెట్ కొంటారా?’ అని మా ఫ్రెండ్స్ అన్నప్పుడు…
