హీరో అల్లు శిరీష్– నయనిక వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో శుక్రవారం రాత్రి…
‘వృషకర్మ’ పై బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై, బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన BTS వీడియో, అద్భుతమైన ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచాయి.
తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్, హీరో నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ దండు ‘వృషకర్మ’ గ్లింప్స్ పై ప్రశంసలు కురిపించారు.
సుకుమార్ మాట్లాడుతూ.. “కార్తీక్ మొదట కథ చెప్పినప్పుడు, నన్ను చాలా ఆకట్టుకుంది. అప్పుడే మేము దీన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాము. బాపినీడు, నేను కలిసి సినిమా ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యాం. ముందుగా, నేను కార్తీక్ గురించి చెప్పాలి. తను ఇండస్ట్రీకి దొరికిన బెస్ట్ టెక్నీషియన్. అతను కథ చెప్పినప్పుడు విజువల్స్ ఇంత అద్భుతంగా వస్తాయని నేను కూడా ఊహించలేదు, అద్భుతంగా చేశాడు.
అజినీస్ విరూపాక్షకు చాలా హెల్ప్ అయ్యాడు, ఈ చిత్రాన్ని కూడా అతను ఎంతగా ఎలివేట్ చేస్తాడో నాకు తెలుసు. కార్తీక్‌లోని ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, అతను బెస్ట్ టెక్నికల్ టీంని ఎంచుకుంటాడు. డీవోపీ రఘుల్ ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమా కలర్ మారిపోయింది.
ప్రోడక్ట్ విషయంలో చాలా హ్యాపీగా పాజిటివ్ గా ఉన్నాను. ముఖ్యంగా నాగ చైతన్య మొదటి నుంచి ఇన్వాల్ అవుతూ సినిమా ఇంత అద్భుతంగా రావడంలో పెద్ద పాత్ర పోషించారు. ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు’.
