Skip to content

జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్. కె ) విడుదల

కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్ మరియు కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ పై
మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్. కె ) తెలుగులో ఈ సినిమా మర్చి 13న విడుదల కాబోతోంది. ఎంజి మూవీస్ ద్వారా అచ్చిబాబు ఈరోజు సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో కథానాయిక జానకి విద్యాదరన్ (అనుపమ పరమేశ్వరన్) పై జరిగే లైంగిక దాడి, ఆ తర్వాత ఆమె న్యాయానికి కోసం చేసే పోరాటం ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తుంది. ఇది సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ, చట్ట వ్యవస్థపైనా ఓ బలమైన సందేశం ఇస్తుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్, అస్కర్ అలీ, మాధవ్ సురేష్ గోపి, బైజు సంతోష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె. ఫణీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సందర్బంగా ఎం. అచ్చిబాబు మాట్లాడుతూ….
మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పకుండ ఆధరిస్తారన్న నమ్మకం ఉంది, ఎన్నో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొని ఈ సినిమా చివరికి విడుదల కాబోతోంది, ఈ చిత్ర నిర్మాత జాస్తి పనిద్ర కుమార్ గారికి అలాగే ఈ అవకాశం కల్పించిన దర్శకునికి నటీ నటులకు కృతజ్ఞతలు తెలిపారు.