Skip to content

డెకాయిట్‌ ఫ్యామిలీతో కలసి చూడదగ్గ సినిమా : హీరో అడివి శేష్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘డెకాయిట్‌’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ సెట్ లో షూట్ ర్యాప్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

షూట్ ర్యాప్ ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. డెకాయిట్‌ ఒక కొత్త జోనర్ లో చేసిన సినిమా. ఈ మధ్యకాలంలో మనం లవ్ స్టోరీస్ చెప్పడం మానేశాను. ఈరోజుల్లో అందరూ ఒక మంచి లవ్ స్టోరీ కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో లవ్ స్టోరీనే యూనిక్. ఇది థ్రిల్లింగ్ యాక్షన్ లో చెప్పిన లవ్ స్టోరీ. ఒక కొత్త జోనర్లో చేసిన ప్రయోగం. కథలో అవసరం ఉందంటే నేను ఏదైనా చేస్తాను. ఇందులో రుబారూ కూడా కథలో ఆ క్యారెక్టర్ కి అవసరమైన సాంగ్. ఈ సినిమా అందరినీ ఎక్సయిట్ చేస్తుంది. సినిమా చివరకు వచ్చేసరికి అందరూ ఎమోషన్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా మీరు ఫ్యామిలీస్ తో కలిసి చూడొచ్చు. నేను మా సిస్టర్ తో కలిసి చూస్తాను. యాక్షన్స్ తో బ్లెండ్ చేసిన లవ్ స్టోరీ ఇది. ఇద్దరూ విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ళ జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్ గా ఉంటుంది. చుట్టూ గన్స్ బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందని ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. నేటి (మార్చి 11)తో కలిపి 149 రోజుల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. కథ ఏడాదిపాటు రాశాం. నేను, షానీ అనుకున్న పేరు అది. ఈ కథలో రాబరీ ఓ భాగం. అందుకే ఆ పేరు పెట్టాం. నాగచైతన్య పెళ్లి వేడుకలో అనురాగ్‌ గారికి ఈ కథ చెప్పా. వెంటనే ఆయన యాక్ట్‌ చేసేందుకు ఓకే అన్నారు. ఇందులో కన్నె పిట్టరో సాంగ్ పెట్టేలానే ఐడియా సుప్రియ గారిది. అది అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ని మ్యాసీవ్ అవుట్ డోర్ యూనిట్లో షూట్ చేసాము. అది స్క్రీన్ మీద చూడడానికి నేను చాలా ఎక్సైటింగ్ ఎదురుచూస్తున్నాను. ప్రకాష్ రాజ్ గారు, అతుల్ కులకర్ణి గారు, సునీల్ గారు, కామాక్షి భాస్కర్ల జరీనా వహాబ్ మేడం ఇలాంటి అద్భుతమైన నటీనటులు ఇందులో ఉన్నారు. అనురాగ్ గారు ఈ సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఒక జెన్యూన్ ఫిల్మ్. ఏప్రిల్ 10న అందరం థియేటర్స్ లో కలుద్దాం’

ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక లాంగ్ జర్నీ. ఈరోజు షూటింగ్ ఫినిష్ అయ్యింది. నెక్స్ట్ డే ఏం చేయాలి అని ఆలోచనలు పడ్డాం(నవ్వుతూ) సినిమా రిలీజ్ చేయాలి. మా జర్నీలో ఏం చేసినా దాన్ని బయటకు తీసుకెళ్లేదే మీడియా. ఈ ఎక్సయిట్మెంట్ మీతో పంచుకోవాలని ఈ సెట్ లో ఈవెంట్ ని నిర్వహించడం జరుగుతుంది. డైరెక్టర్ కి ఇది ఫస్ట్ ఫిలిం, అనురాగ్ ఫస్ట్ తెలుగులో నటిస్తున్న సినిమా, శేష్ గారు చేస్తున్న ఫస్ట్ లవ్ స్టోరీ ఇది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

డైరెక్టర్ షానియల్ డియో మాట్లాడుతూ.. ఇది మూడేళ్ల జర్నీ. ఈ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా మారిపోయారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి థాంక్యూ. ఆయన చాలా సపోర్ట్ చేశారు. భీమ్స్ గారు తన మ్యూజిక్ తో సినిమా నేను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అనురాగ్ గారితూ వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సుప్రియ గారికి శేష్ గారికి థాంక్ యూ. ఈ సినిమా మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నేను హైదరాబాద్ కి ఓ పెళ్లి వేడుక కోసం వచ్చాను. ఆ సమయంలో ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది సుప్రియ నాకు ఆర్జీవి గారితో పనిచేస్తున్న రోజుల నుంచి తెలుసు. డైరెక్టర్ శానిల్ తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది చాలా అద్భుతమైన పాట. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇలాంటి మంచి కథలో పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా పెద్ద ప్రయాణం. చాలా విషయాలు నేర్చుకున్నాను. రుబారు పాట చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది.

కొరియోగ్రాఫర్ విజయ్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుప్రియ గారికి ధన్యవాదాలు. ఎప్పటినుంచో అన్నపూర్ణలో పనిచేయాలని కల ఉండేది. సినిమాతో అది నెరవేరింది, శేష్ గారు చేసిన పెర్ఫార్మన్స్ మీరందరూ స్క్రీన్ మీద చూస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయన చాలా డెడికేషన్ తో చేశారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా మంచి సినిమా అయి ఉంటుందని నమ్మకం ఉంటుంది. సూపర్ హిట్ సినిమాలో ఇది ఒక సూపర్ హిట్ సాంగ్ అవుతుంది. ఈ పాటతో అందరూ వైబ్ అవుతారు. శేష్ గారు స్టెప్స్ ఇరగదీశారు.

ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ సినిమా సెట్ లో పెట్టడం చాలా స్పెషల్ గా ఉంది. సినిమా ఇంత బ్రహ్మాండంగా రావడానికి కారణం సుప్రియ గారు శేష్ గారు. సుప్రియ గారు కొత్త సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్ ఎలా అయితే పాషన్ తో చేస్తారో అంత పాషన్ తో ఈ సినిమా చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇది చాలా పెద్ద హిట్ మూవీ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ వున్నాం’ ఈ ప్రెస్ మీట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.