Skip to content

‘ది ప్యారడైజ్’ లో సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ లో సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్ Telugu News

నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆయా షేర్’ సింగిల్ విడుదల తర్వాత నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర రివల్ తో ఆసక్తిని మరింత పెంచుతోంది.

అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు ఈరోజు ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కయాదు లోహర్ ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని పోస్టర్ సూచిస్తోంది.

సినిమాలో హై-ఆక్టేన్ క్యారెక్టర్స్, పవర్‌ఫుల్ ఆర్క్స్ మధ్య సుబ్బు పాత్ర ఒక కొత్త ఎమోషనల్ లేయర్‌ను జోడిస్తోంది. ఆమె పాత్ర హీరో ప్రయాణంలో ఇంపాక్ట్ ఫుల్ గా ఉండబోతుంది.

ఇప్పటికే భారీ విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్, బలమైన పాత్రలతో ఈ చిత్రం అంచనాలు పెంచుతోంది. మోహన్ బాబు విలన్‌గా, రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో, అలాగే సంపూర్ణేష్ బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని చ్ సాయి, ఎడిటింగ్‌ను నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు.

‘ది పారడైస్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: నాని, కయాదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.