Skip to content

“జన నాయగన్” మూవీ లీక్ బాధ కలిగించింది – నిర్మాత ఎస్ కేఎన్

“జన నాయగన్” మూవీ లీక్  బాధ కలిగించింది – నిర్మాత ఎస్ కేఎన్ Telugu News

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్ కు ముందే లీక్ కావడంపై ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందించారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. సాటి ప్రొడ్యూసర్ గా కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి ఆవేదన అర్థం చేసుకోగలనని ఎస్ కేఎన్ పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందిస్తూ – జననాయగన్ సినిమా రిలీజ్ కు ముందు లీక్ కావడం బాధ కలిగించింది. ఇలాంటి సందర్భంలో కేవీఎన్ సంస్థ ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారో అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితే నేను నిర్మించిన టాక్సీవాలా సినిమా టైమ్ లో ఎదుర్కొన్నాను. మా టాక్సీవాలా మూవీ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీక్ చేశారు. అప్పుడు నేను ఎంతో ఒత్తిడికి, నిరాశకు లోనయ్యా. ఒక సినిమా నిర్మాణం కోసం మనం పడే తపన, కష్టం, నిద్రలేని ఎన్నో రాత్రుల శ్రమను ఇలాంటి కొందరు దోచుకోవడం కలచివేస్తోంది. హీరో విజయ్, ఆయన అభిమానులకు నా సంఘీభావం తెలియజేస్తున్నా. ఇలాంటి సమయాల్లోనే బలంగా నిలబడాలి. ఎన్ని పైరసీలు జరిగినా ప్రేక్షకుల ప్రేమే మనల్ని గెలిపిస్తుంది. ఇలాంటి ఘటనల్లో మనమంతా ఒక్కటిగా నిలబడాలి. పైరసీని లేకుండా చేద్దాం. సినిమాను కాపాడుకుందాం. అని అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.