Skip to content

‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు

‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు Telugu News
‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు Telugu News
‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు Telugu News

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అర్జున్ అంబటి. అతను హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పరమపద సోపానం’. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ సినిమాతో తన మ్యూజిక్ పవర్‌ను చూపించిన డేవ్ జాండ్, ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘చిన్ని చిన్ని తప్పులేవో’, ‘భూమ్ భూమ్’ వంటి పాటలకు యూట్యూబ్‌లో విశేష స్పందన లభించింది. టీజర్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ సందర్భంగా ట్రైలర్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీవిష్ణు ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఇప్పుడే ‘పరమపద సోపానం’ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. అర్జున్ అంబటి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు నాగ శివ కూడా నాకు చాలా కాలం నుండి తెలుసు. టాలెంటెడ్ డైరెక్టర్, మంచి హార్డ్ వర్కర్. ఈ సినిమాతో ఆయన కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను.’పరమపద సోపానం’ సినిమాకి పనిచేసిన వారందరికీ నా బెస్ట్ విషెస్” అని చెప్పుకొచ్చారు.
ఇక ‘పరమపద సోపానం’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సోషల్ ఎలిమెంట్ ను కూడా దర్శకుడు నాగ శివ ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్టు స్పష్టమవుతుంది. హీరో అర్జున్ అంబటి కటౌట్ ని యాక్షన్ ఎపిసోడ్స్ కి వాడిన తీరు, రొమాంటిక్ సన్నివేశాలు, బీచ్ సీక్వెన్స్..లు వంటివి చూస్తుంటే తన గురువు పూరీ జగన్నాథ్ మార్కు ‘మాస్ అండ్ క్లాస్’ శైలిని దర్శకుడు నాగ శివ ఒంటబట్టించుకున్నారని స్పష్టమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ‘పరమపద సోపానం’ ఏప్రిల్ 24కి ముస్తభవుతోంది అనే హోప్స్ ని కూడా ట్రైలర్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు :
అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్
దర్శకత్వం : నాగ శివ
నిర్మాతలు : గణపర్తి నారాయణరావు
సహ నిర్మాతలు : తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు, పులగం సుప్రియ
లైన్ ప్రొడ్యూసర్ : పసుపులేటి సౌమ్య
నిర్మాణ సంస్థ : స్వయంభూ క్రియేషన్స్
సంగీతం : డేవ్ జాండ్
సినిమాటోగ్రఫీ : ఈశ్వర్
పీఆర్ఓ : ఫణి కుమార్ పులపర్తి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.