2026 మెగా ద్వయం సంచలనం.. సరికొత్త చరిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్
భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో లెజెండరీ ఫ్యామిలీస్, సక్సెస్ ఫుల్ జనరేషన్స్, ఒకే ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు వచ్చారు. అయితే 2026లో మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన ఘట్టం నమోదైంది. తండ్రి, కుమారుడు కలిసి ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టారు. మొదట మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’తో ఆ రికార్డును అధిగమించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’,…
