ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
▪️హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో వివాదంతో సతమతం అయ్యాం ▪️ ఇప్పుడు సినిమా విజయంతో సంతోషంగా ఉన్నాం ▪️ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: డైరెక్టర్ సంజీవ్ మేగోటి ▪️ ప్రేక్షకుల ఆదరణతో రెండో రోజు నుంచే పెరిగిన థియేటర్లు ▪️ పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా దూసుకుపోతున్న ‘పోలీస్ కంప్లైంట్’ హైదరాబాద్: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు అన్ని…
