Skip to content

3.0 వెర్షన్ యాప్ ను లాంఛ్ చేసిన ఆహా ఓటీటీ

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తున్న ఆహా ఓటీటీ…తన 3.o వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్తగా డిజైన్ చేసిన యూజర్ ఇంటర్ ఫేస్, యూజర్ ఎక్సిపీరియన్స్ తో ఆహా తన 3.0 ను లాంఛ్ చేసింది. ‘స్టోరీస్’, లాంగ్వేజ్-ఫస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్స్ ఉండటం 3.0 ప్రత్యేకత. ఆహా 3.o యాప్ యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో లాంఛ్ చేశారు. సబ్ స్క్రైబర్స్ కు టెక్నికల్ గా మరింత మెరుగైన ఎక్సిపీరియన్స్ ను ఈ సరికొత్త వెర్షన్ అందించబోతోంది. ఇప్పటికే ఉన్న సబ్ స్క్రైబర్స్ ఈ కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసుకోవచ్చు.

ఆహా 3.o లో సరికొత్తగా రీ-డిజైన్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. హోమ్ స్క్రీన్, హీరో కరౌసెల్, స్టోరీస్, డైనమిక్ క్యాప్సూల్స్ ద్వారా సబ్ స్క్రైబర్స్ తమకు నచ్చిన సినిమాలు, షోలను సెకండ్స్ లో సెర్చ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే లాంగ్వేజ్ సెలెక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆటో ప్రివ్యూలు, థంబ్‌నెయిల్ ప్రివ్యూలు, వీడియో ప్లేబ్యాక్ వంటి ప్రతి చోటా ఆడియో భాష ముందే స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల సబ్ స్క్రైబర్స్ తాము ఏ భాషలో కంటెంట్ చూస్తున్నారో సులభంగా తెలుసుకోవచ్చు.

ఆహా 3.0 లో సరికొత్తగా స్టోరీస్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ యాప్ లోని బెస్ట్ మూవీస్ కు సంబంధించిన షార్ట్ ఫార్మాట్ ప్రివ్యూలను చూడవచ్చు. కంటెంట్‌ను సులభంగా ఎంచుకోవడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే యూజర్లు తమ ప్రొఫైల్‌ను తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆహా 3.0 లో స్ట్రీమింగ్ అవుతున్న ఎగ్జైటింగ్ కంటెంట్‌లో ‘నా వైఫ్ మిస్సింగ్’ బాగా ఆకట్టుకోనుంది. శ్వేతా బాసు ప్రసాద్, వరుణ్ సందేశ్ కలిసి నటించిన ఈ థ్రిల్లర్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహా 3.o గురించి ఆహా ప్రొడక్ట్ అండ్ అనలిటిక్స్ ఎస్‌విపి దిలీప్ చంద్ర మాట్లాడుతూ – సబ్ స్క్రైబర్స్ తమ కంటెంట్ ను సెర్చ్ చేయడాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చడమే మా ఆహా 3.0 లక్ష్యం. రీ-డిజైన్ చేసిన యూఐ, యూఎక్స్ యాప్‌కి కొత్త లుక్ ఇస్తే, స్టోరీస్ ఫీచర్ సబ్ స్క్రైబర్స్ కంటెంట్‌ను ఈజీగా సెర్చ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్లతో సబ్ స్క్రైబర్స్ ఆహా కేటలాగ్ లోని విస్తృతమైన కంటెంట్‌ను ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. అన్నారు.

సీఓఓ రామ్ శివలింగ మాట్లాడుతూ – ఆహా 3.o యాప్ లాంఛ్ తో బలమైన రీజనల్ ఎంటర్ టైన్ మెంట్ ప్లాట్ ఫామ్ గా ఆహాను తీర్చిదిద్దడంలో మరో పెద్ద ముందడుగు వేశాం. ప్రేక్షకులకు గొప్ప స్టోరీస్ ను అందించాలనే లక్ష్యంతో సాగుతున్నాం. సబ స్క్రైబర్స్ కు మరింత విస్తృతమైన కంటెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. మంచి కంటెంట్ ఉన్న ఒరిజినల్స్ అందిస్తూ ప్రేక్షకులతో మాకున్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాం. అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.