Skip to content

కాస్టింగ్ కాల్ ను ప్రకటించిన “రామభద్రుడు” సినిమా టీమ్!

“యంగ్ అండ్ డైనమిక్”, “మా రాముడు అందరివాడు” వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “రామభద్రుడు”. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. “రామభద్రుడు” టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ 14వ సినిమా నుంచి ప్రతిభ గల కొత్త నటీనటులకు ఆహ్వానం పలుకుతూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. 20 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 20 మంది మేల్ నటులు, 15 నుంచి 45 ఏళ్ల వయసుల గల 15 మంది నటిలు, 5 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలు 5 గురు ఈ సినిమాలో మంచి పాత్రలకు తీసుకుంటామని “రామభద్రుడు” సినిమా టీమ్ తెలిపారు. ఆసక్తి గల నటీనటులు మీ పోర్ట్ ఫోలియా, వీడియోస్ ను 9347209006, 9849680717 నెంబర్స్ కు వాట్సాప్ చేయవచ్చు లేదా sriramulup1991@gmail.com మెయిల్ చేయవచ్చు. వచ్చే నెల 13,14,15 తేదీల్లో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెం.3లో గల గోల్డెన్ గ్లోరీ గెస్ట్ హౌస్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరుగుతాయి.

“రామభద్రుడు” చిత్రానికి మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గా వరప్రసాద్ నిర్మిస్తుండగా సుందర్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నటీనటులు – తనికెళ్ల భరణి, నాగ మహేష్, సమ్మెట గాంధీ, చిత్రం శీను, చిట్టిబాబు, సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, క్రాంతి, తదితరులు

టెక్నీషియన్స్
—————–
ప్రొడక్షన్ మేనేజర్ – రాహుల్ యాదవ
కో డైరెక్టర్స్ – రవీందర్ రెడ్డి
అసిస్టెంట్ డైరెక్టర్ – మనోహర్
మ్యూజిక్ – బొల్లా వెంకటేష్
కో ప్రొడ్యూసర్ – సుందర్ రాజ్
ప్రొడ్యూసర్ – దుర్గా వరప్రసాద్
డైరెక్టర్ -మహేష్ భాగ్యరాజ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.