Skip to content
ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ “వర్జిన్ బాయ్స్” చిత్రం సక్సెస్ మీట్ – పూల చొక్కా నవీన్, మరికొన్ని యూట్యూబ్ చానల్స్ పై కంప్లైంట్ Telugu News

ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ “వర్జిన్ బాయ్స్” చిత్రం సక్సెస్ మీట్ – పూల చొక్కా నవీన్, మరికొన్ని యూట్యూబ్ చానల్స్ పై కంప్లైంట్

రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ గ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఎంతో ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో కేక్ కటింగ్ తో చిత్ర బృందం వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మా వర్జిన్ బాయ్స్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మాకు మొదటి నుండి సపోర్టుగా నిలిచిన మీడియా వారికి…

Read more
వీకెండ్ బెస్ట్ ఫిల్మ్ గా ఓ భామ అయ్యో రామ* Telugu News

వీకెండ్ బెస్ట్ ఫిల్మ్ గా ఓ భామ అయ్యో రామ*

ఆడియన్స్ మనసు గెలిచిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్. "ఓ భామ అయ్యో రామ" చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ద‌ర్శ‌కుడు అవుదామ‌నుకున్న సుహ‌స్ పాత్ర ని భామ పాత్ర లొ న‌టించిన మాళ‌విక ఎలా త‌న ప్ర‌య‌త్నానికి తొడ్ప‌డింది, ఎలా సుహ‌స్ ని ద‌ర్శుకుడిగా నిల‌బెట్టింది అనేది సినిమా లొ ముఖ్యాంశం.. ఈ సినిమా లొ మ‌ళ‌యాల భామ మాళవిక అందానికి , న‌ట‌న‌కి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.. సుహ‌స్ ని ద‌ర్శ‌కుడి గా చేసే ప్రోస‌స్ లొ మాళ‌విక‌, సుహ‌స్ ల మ‌ద్య వ‌చ్చే స‌న్నివేశాలు ధియోట‌ర్స్ లొ విజిల్స్ ప‌డేలా చేస్తున్నాయి.. మ‌ధ్య‌లొ వ‌చ్చే కొన్ని ప్యార‌డి క‌థ లు క‌డుపుబ్బ న‌వ్విస్తున్నాయి.. మ‌ళ‌యాలం లొ జో చిత్రం తొ…

Read more
‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ జూలై 12న టైటిల్ టీజర్ విడుదల Telugu News

‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ జూలై 12న టైటిల్ టీజర్ విడుదల

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా'. 'VISA - వింటారా సరదాగా' ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త యూత్‌ఫుల్ రైడ్‌ను వాగ్దానం చేస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను, సందిగ్ధతలను, స్నేహాలను మరియు మధుర క్షణాలను ప్రేక్షకుల మనసుకి తాకేలా చూపించనుంది. యువత మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు…

Read more
‘సార్‌ మేడమ్‌’ టైటిల్ టీజర్ రిలీజ్- ఈ నెల 25న థియేటర్స్ లో రిలీజ్ Telugu News

‘సార్‌ మేడమ్‌’ టైటిల్ టీజర్ రిలీజ్- ఈ నెల 25న థియేటర్స్ లో రిలీజ్

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘సార్‌ మేడమ్‌’ టైటిల్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌ పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలై.. భార్యభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో ఆకట్టుకుంది. విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్ మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకుల్ని అలరించాయి. టీజర్‌ ప్రారంభంలో వంట మాస్టర్‌లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని…

Read more
14న ” K-ర్యాంప్” నుంచి ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ రిలీజ్ Telugu News

14న ” K-ర్యాంప్” నుంచి ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ స్పెషల్ వీడియోతో " K-ర్యాంప్" సినిమా నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 14న ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. కొచ్చి పోర్ట్ లొకేషన్ లో కిరణ్ అబ్బవరం, దర్శకుడు జైన్స్ నాని మధ్య…

Read more
‘హనుమాన్’ స్థాయిలో ‘గదాధారి హనుమాన్’ చిత్రం హిట్ అవుతుంది.. నిర్మాత సి. కళ్యాణ్* Telugu News

‘హనుమాన్’ స్థాయిలో ‘గదాధారి హనుమాన్’ చిత్రం హిట్ అవుతుంది.. నిర్మాత సి. కళ్యాణ్*

మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ చిత్రంగా విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘హనుమాన్’ సినిమాను నేనే ప్రారంభించాను. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్…

Read more
కూలీ నుంచి పూజా హెగ్డే  మోనికా రిలీజ్ Telugu News

కూలీ నుంచి పూజా హెగ్డే మోనికా రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. మోనికా అనే ఈ పాట ఎక్స్‌ప్లోజివ్ నెంబర్ గా అదరగొట్టింది. సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ పాటలో పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్ లో, ప్రతి ఫ్రేమ్‌ను తన అద్భుతమైన మూవ్స్ తో కట్టిపడేసింది. ఆమెతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కనిపించడం ట్రాక్‌కు ఫన్ ఎనర్జీ తీసుకువచ్చింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్…

Read more
రాజమౌళి లాంచ్ చేసిన  ‘జూనియర్’ ట్రైలర్‌ Telugu News

రాజమౌళి లాంచ్ చేసిన ‘జూనియర్’ ట్రైలర్‌

'జూనియర్' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌లోకి అరంగేట్రం చేస్తున్న కిరీటి రెడ్డి టీజర్‌లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ యూత్ అండ్ హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్ కు రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. జూలై 18న రిలీజ్ కానుండటంతో టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. పాటలు కూడా చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఈరోజు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అభిని తల్లిదండ్రులు చాలా గారభంగా చూసుకుంటారు. తండ్రి అభిని ఎంతో ప్రేమతో చూస్తాడు. కాలేజ్‌కి వచ్చిన తర్వాత క్లాస్‌మేట్ స్పూర్తిని ప్రేమించేస్తాడు. అప్పటి వరకు అభి జీవితం హ్యాపీగా, ఎలాంటి బాధ్యతలూ…

Read more
పవన్ కళ్యాణ్  ‘ఓజీ’ షూటింగ్ పూర్తి Telugu News

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర గంభీరగా అలరించనున్న చిత్రం 'ఓజీ'. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ 'ఓజీ' చిత్రీకరణ పూర్తయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ కారు దిగి గన్ తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ…

Read more
రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్ “మైనే ప్యార్ కియా”  ఆగస్ట్ 29న థియేటర్స్ లో విడుదల !!! Telugu News

రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్ “మైనే ప్యార్ కియా” ఆగస్ట్ 29న థియేటర్స్ లో విడుదల !!!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం మైనే ప్యార్ కియా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ఆవిష్కరించింది, ఇది రొమాన్స్, కామెడీ మరియు సస్పెన్స్‌లతో కూడిన థ్రిల్లర్, ఫన్నీ ఎలిమెంట్స్ తో కూడిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మరియు రచయిత ఫైజల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని స్పైర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజు ఉన్నితన్ నిర్మించారు, ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ మందాకిని తర్వాత కంపెనీ యొక్క నాల్గవ ప్రధాన వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిచ్ మేకింగ్ వాల్యూస్ తో ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడింది. ప్రేక్షకులకు ఎంగేజింగ్ గా ఫీల్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా ఉండబోతున్నాయి. హీరో, హీరోయిన్ హృదు హరూన్…

Read more