‘వార్ 2’లో హృతిక్ పాత్రను ఆడియెన్స్‌కి మరింత దగ్గర చేసేలా స్టైలింగ్ చేశాము – కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా
గ్రీకు గాడ్ ఆఫ్ ఇండియా అని అభిమానులు ఎంతో ఇష్టంగా పిలుచుకునే హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. భారతదేశంలో అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరైన హృతిక్ తన యాక్షన్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌కు పెట్టింది పేరు. వరుస విజయాలను అందించే YRF స్పై యూనివర్స్‌లోని బ్లాక్‌బస్టర్ వార్ ఫ్రాంచైజీలో హృతిక్ సూపర్ గూఢచారి అయిన కబీర్ పాత్రను హృతిక్ అద్భుతంగా పోషించిన సంగతి తెలిసిందే. ‘వార్’ చిత్రంలో కబీర్ పాత్రలో హృతిక్ కనిపించిన తీరు, ఆయన స్టైలింగ్, లుక్స్, క్యాస్టూమ్స్‌కు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ‘వార్ 2’లోనూ హృతిక్ మళ్లీ కబీర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సారి మాత్రం మరింత స్టైలీష్‌గా…
