Skip to content

ప్రశంసలతో పాటు అవార్డులు దక్కించుకుంటున్న బన్నీ వాస్‌

ప్రశంసలతో పాటు అవార్డులు దక్కించుకుంటున్న బన్నీ వాస్‌ Telugu News
ప్రశంసలతో పాటు అవార్డులు దక్కించుకుంటున్న బన్నీ వాస్‌ Telugu News

అవార్డ్ విన్నింగ్ చిత్రాలు, కమర్షియల్ మూవీస్..ఈ రెండూ భిన్నమైనవి. పురస్కారాలు గెల్చుకునే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కదు అలాగే కమర్షియల్ మూవీస్ కు అవార్డ్స్ వచ్చే అవకాశాలు తక్కువ. కానీ నిర్మాతగా మంచి వ్యాల్యూస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రేక్షకుల రివార్డ్స్, అవార్డ్స్ సొంతం చేసుకుంటున్నారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్. ఆయన ఇటీవల నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ఆయ్, తండేల్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడమే కాదు పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెల్చుకోవడం విశేషం.

బన్నీ వాస్ నిర్మించిన ఆయ్ సినిమా హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా గతేడాది గద్దర్ అవార్డ్ ను గెల్చుకుంది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రానికి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ తో పాటు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా శరణ్య కు గద్దర్ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది తండేల్ సినిమా బెస్ట్ యాక్టర్, ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా రెండు గద్దర్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య గద్దర్ అవార్డ్ గెల్చుకున్నారు. బన్నీ వాస్ డిస్ట్రిబ్యూట్ చేసిన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు ఇటీవలి గద్దర్ అవార్డ్స్ లో సత్తాచాటాయి. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ తో పాటు ఈ అవార్డ్స్ అందించే ప్రోత్సాహంతో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు నిర్మాత బన్నీ వాస్.

See also  'ప్రేమంటే' ఫన్ థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ ట్రైలర్ రిలీజ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.