ప్రభాస్ లాంచ్ చేసిన ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ "కాంతార" బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతారా: చాప్టర్ 1 ట్రైలర్ ని రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. 'నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ''ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. ధర్మాన్ని కాపాడ్డానికి…
