మోహన్ బాబు విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ శివమణి, మీడియా దిగ్గజం విజయ్ దర్దాకు డాక్టరేట్ ప్రదానం*
మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) రెండో గ్రాడ్యుయేషన్ డే తిరుపతిలో శనివారం (ఆగస్ట్ 2) నాడు ఘనంగా జరిగింది. ఈ వేడుక ప్రముఖులు, గ్రాడ్యుయేట్లు, గౌరవనీయ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు శ్రీ ప్రఫుల్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎం.బి.యు ఛాన్సలర్, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (SVET) చైర్మన్ డాక్టర్ ఎం. మోహన్ బాబు, ఎం.బి.యు ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు, గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కు సంయుక్తంగా డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఎస్వీఈటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వినయ్ మహేశ్వరి, ట్రస్ట్ నాయకత్వంలో కీలక సభ్యురాలు శ్రీమతి విరానికా మంచు…
