Skip to content

‘కూలీ’ పవర్ ప్యాక్డ్ గూస్ బంప్స్ ట్రైలర్ రిలీజ్

‘కూలీ’ పవర్ ప్యాక్డ్ గూస్ బంప్స్ ట్రైలర్ రిలీజ్ Telugu News
‘కూలీ’ పవర్ ప్యాక్డ్ గూస్ బంప్స్ ట్రైలర్ రిలీజ్ Telugu News

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’, మోనికా సాంగ్, పవర్ హౌస్ పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

”ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో తలమీద రాసిపెట్టి ఉంటుంది”అనే నాగార్జున పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ పవర్ ప్యాక్డ్ మూమెంట్స్ తో గూస్ బంప్స్ తెప్పించింది.

‘అడుగు పెడితే విజలు మోగులే’ అనే పవర్ ఫుల్ బీజీఎంతో దేవా పాత్రలో రజనీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. రజనీకాంత్ స్వాగ్ ఆడియన్స్ మెస్మరైజ్ చేసింది. డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయి.

నాగార్జున లుక్ ఆడియన్స్ ని చాలా సర్ ప్రైజ్ చేసింది, నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించారు నాగార్జున. ఆయన క్యారెక్టర్ సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో ట్రైలర్ తెలియజేసింది.

సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌, సూపర్ స్టార్ ఉపేంద్ర ఎంట్రీలు అదిరిపోయాయి.

సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్ పాత్రలు చాలా ఆసక్తికరంగా వున్నాయి.

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీ కోసం చేసిన వరల్డ్ బిల్డింగ్ అద్భుతంగా వుంది. ఆయన టేకింగ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.

అనిరుధ్ బ్యాగ్రౌండ్ నెక్స్ట్ లెవల్ లో చేశారు. గూస్ బంప్స్ బీజీఎం ఇచ్చారు.

గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీ వుంది. విజవల్స్ చాలా గ్రాండియర్ గా వున్నాయి.

కలానిధి మారన్ సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉన్నాయి.

ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవల్ లో వుంది. ట్రైలర్ చాలా పవర్ ప్యాక్డ్ గా వుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలని డబుల్ చేసింది.

డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.

ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.

నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్: ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డిఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.