రాజ్‌తరుణ్-విజయ్ మిల్టన్ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ముఖ్యపాత్రలో నటించనున్న ‘ప్రేమిస్తే’ భరత్
రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ తరుణ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో 'ప్రేమిస్తే' భరత్ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. కాదల్, పట్టియల్, కాలిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో ఎమోషనల్ అండ్ ఎనర్జీ నండిన పాత్రను పోషిస్తున్నాడు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుంది. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్ ఇండియన్ రేంజ్…