“ప్రేమనే ఊరిలో” చిత్రం నుండి ‘ఏరై పారే హృదయం’ పాటకు అనూహ్య స్పందన
మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటకు సమీరా భరద్వాజ్ తన స్వరాన్ని జోడించగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్ ప్రీతిరెడ్డి ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నటి, గాయకి సమీరా భరద్వాజ్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను ప్రేమనే ఊరిలో సినిమాలో…
