‘రంభ ఊర్వశి మేనక’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మూవీ: అల్లరి నరేష్
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది? -సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి…
