ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న రిలీజ్
రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఫౌజీ'తో వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, టి-సిరీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అద్భుతమైన టైటిల్ పోస్టర్‌తో అంచనాలు పెంచింది. రిలీజ్ డేట్ తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో 'ఫౌజీ' ప్రపంచాన్ని, సినిమా భారీ స్థాయిని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రభాస్ ఇప్పటివరకు ఎప్పుడూ…
