సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్…
‘రంభ ఊర్వశి మేనక’ కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు: హీరో అల్లరి నరేష్
అల్లరి నరేష్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రంభ ఊర్వశి మేనక’ ఈరోజు రిలీజ్ అయింది. సింగిల్ స్క్రీన్స్, బి, సి సెంటర్స్‌లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. శని, ఆదివారాలు ఏ సెంటర్స్‌లో కూడా పికప్ అవుతుంది. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా ఇది. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే చిన్న భయం ఉండింది. కాకపోతే ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్‌తో చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఫోన్ చేసి ఎలాంటి సినిమాలు మీ నుంచి కోరుకుంటున్నామో, అలాంటి సినిమా చూశామని చెప్తున్నారు. ఈ సినిమా కోసం మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. సినిమాకి చాలా మంచి టాక్ ఉంది. లాజిక్కుల వదిలేసి ఒక మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయండి. ఇంకా చూడని వాళ్లు తప్పకుండా ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఇంకా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ.
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇది బ్లాక్‌బస్టర్ సినిమా. ఈ సినిమాలో పెద్ద నరేష్ గారితో నా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మీ అందరి సపోర్ట్‌కి థాంక్యూ సో మచ్.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సీనియర్ ఎన్టీఆర్ గారి ‘యమగోల’ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘యమదొంగ’ దాకా.. భూలోకం యమలోకం ఇది సక్సెస్ ఫార్ములా. ‘రంభ ఊర్వశి మేనక’ అది మరొకసారి నిరూపించింది. ఈ సినిమా జెన్ ఏ(అల్లరోడి) కామెడీ. నరేష్ గారి కామెడీ ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటుంది. బి సెంటర్‌లో, సి సెంటర్‌లో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మేము నమ్మిన సక్సెస్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ చంద్ర మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఒక చందమామ లాంటి కథ చెప్పాలనుకున్నాను. అది మనందరికీ తెలుసు. కాకపోతే ఎన్నిసార్లు చదివినా అది అందంగా, హాయిగా ఉంటుంది. రంభ, ఊర్వశి, మేనక స్వర్గంలో ఉంటారు. కిందకి వస్తారు. అది మనం చాలా సినిమాలు చూశాం. ఈ సినిమాలో ఎంత ఫన్‌గా చెప్పామనేది ఆడియన్స్ చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. అందరూ ‘నరేష్ ఈజ్ బ్యాక్’ అని అంటున్నారు. కామెడీ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎమోషన్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కాస్త లాజిక్ ని పక్కన పెట్టి మ్యాజిక్ ని ఎంజాయ్ చేయండి. మీరు హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతారు. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.
ఎడిటర్ చోటా కె. ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమాకి మార్నింగ్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఆడియన్స్ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆడియన్స్ కామెడీని భీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మారుమూల గ్రామాల నుంచి అద్భుతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అల్లరి నరేష్ అదరగొట్టేశారు . ఇదే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ కంటిన్యూ కావాలని, అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.

