‘సైరాబాను’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
ఆది సాయికుమార్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సైరాబాను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. విభిన్నమైన ప్రేమకథ, ఆసక్తికరమైన పాత్రలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆది సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే లుక్‌లో కనిపిస్తున్నారు. తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిపై విభూది, మెడలో…
