టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యష్ తల్లి మధ్య ప్రస్తుతం…
‘రంభ ఊర్వశి మేనక’ తో ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం: హీరో అల్లరి నరేష్

- రంభ ఊర్వశి మేనక ష్యూర్ షాట్ సూపర్ డూపర్ హిట్: మైత్రి మూవీ మేకర్స్ వై. రవిశంకర్
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారి అభిమానిని. ఆయనతో కలిసి ‘నా సామి రంగా’ సినిమాలో నటించాను. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్‌లో హీరోగా చేస్తున్నాను. నిమ్మకాయల ప్రసాద్ గారితో పరిచయం నాకు ‘అల్లరి’ సినిమా నుంచి మొదలైంది. ఆ సినిమాకి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అప్పటినుంచి నాకు బాగా తెలుసు. ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. ఈ కథ ఆయనకి చాలా నచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. చంద్రమోహన్ గారు దర్శకుడు కావడానికి చాలా కష్టపడ్డారు. పరిశ్రమలో అవకాశాలు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా నాన్నగారు కూడా ‘చెవిలో పువ్వు’ సినిమా తర్వాత వన్ ఇయర్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉండేదో నేను చూశాను. దర్శకుడు చంద్రమోహన్‌కి ఇక్కడి నుంచి సక్సెస్ మొదలవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకంటే చంద్రమోహన్ కోసం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో పెద్ద నరేష్ గారు ఉన్నారు. కచ్చితంగా నవ్వులు రెండింతలు ఉంటాయి. మా రంభ, ఊర్వశి, మేనక చాలా కష్టపడ్డారు. చాలా ఎనర్జీతో ఈ సినిమా చేశారు. సురభి కూడా చాలా చక్కగా పర్ఫార్మ్ చేసింది. తను మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది అందరినీ నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 4. సక్సెస్ మీట్ సెప్టెంబర్ 9. సినిమాతో హిట్టు కొడుతున్నాం. సక్సెస్ మీట్ పెడుతున్నాను.
దర్శకుడు చంద్రమోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా తొలి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. నరేష్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పటి నుంచి ఫైనల్ వరకు ఆయన ఎంతగానో బిలీవ్ చేశారు. అలాగే వెన్నెల కిషోర్ గారు, ప్రవీణ్, నరేష్ గారు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే చేతన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నా టీమ్‌కి పేరుపేరునా ధన్యవాదాలు. సక్సెస్ మీట్‌లో అందరి గురించి చెప్తాను. ఈ సినిమాకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 4 ‘భలే భలే మగాడివోయ్’, ‘అష్టా చమ్మా’ ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి ఆ రకంగా సెప్టెంబర్ 4 చాలా హిట్ డేట్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో హిట్ కళ కనిపించింది. ఇప్పుడు రాజేష్ గారికి కింగ్ నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కూడా తోడైంది. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారి అభిమానిని. అలాగే నరేష్ గారి సినిమాలు ఎంజాయ్ చేస్తుంటాం. తెలుగు సినిమా మంచి గోల్డెన్ పీరియడ్‌లో ఉంది. ఈ సినిమా అల్లరి నరేష్ గారి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాతో నవ్వుల మోత మోగిపోతుంది. నరేష్ గారికి తప్పకుండా పెద్ద హిట్ వస్తుంది.
హీరోయిన్ సురభి మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. హాస్య మూవీస్‌కి, అన్నపూర్ణ స్టూడియోస్‌కి థాంక్యూ. మా డైరెక్టర్ చంద్రమోహన్ గారికి థాంక్యూ. చాలా సపోర్ట్ చేశారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో చిన్ని క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. నరేష్ గారితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను.
మైత్రి మూవీ మేకర్స్ రవి మాట్లాడుతూ.. ఈ ట్రైలర్, అలాగే సినిమా చిత్ర బృందం మాట్లాడుతున్న నమ్మకం చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కాబోతుందని అర్థమవుతుంది. అల్లరి నరేష్ గారి నుంచి ఒక మంచి కామెడీ సినిమా గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. అలాంటి సమయంలో ‘రంభ ఊర్వశి మేనక’ వస్తోంది. సెప్టెంబర్ 4న మంచి ట్రీట్. నేను కంపల్సరీగా వెళ్తున్నాను. అలాగే మీరందరూ కూడా చూస్తారని నమ్ముతున్నాను. నరేష్ గారికి కచ్చితంగా చాలా పెద్ద హిట్ పడుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు, అఖిల్ గారు.. అందరూ అన్ని పాజిటివ్ ఎనర్జీ సినిమా వెనక ఉన్నాయి. ‘రంభ ఊర్వశి మేనక’ ష్యూర్ షాట్ సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుంది.
నిర్మాత నిమ్మకాయల ప్రసాద్ మాట్లాడుతూ.. నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున అందరికీ ధన్యవాదాలు. రంభ ఊర్వశి మేనక.. ఇంద్రుడు, యముడు.. ఇది తెలుగు వాళ్లకి ఒక్కరికే సొంతమైన జానర్. ఇదివరకు వచ్చిన సినిమాల్లో ఎలా ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యారో, సెప్టెంబర్ 4న అంతే ఎంటర్టైన్ అవుతారని ప్రామిస్ చేస్తున్నాను. గత ఐదు నెలలుగా తెలుగు ప్రేక్షకులు ప్రతి సినిమాని థియేటర్‌లో ఆదరిస్తున్నారు. అలాగే నా సినిమాను కూడా ఆదరిస్తారని, సపోర్ట్ కొనసాగుతుందని కోరుకుంటున్నాను.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ఒక సినిమాకి జీవితాన్ని ఇచ్చేది ప్రేక్షకులే. ఎన్నో ఎలివేషన్స్‌తో పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. కాకపోతే మనకి అచ్చమైన తెలుగు సినిమా ఉంది. జంధ్యాల గారు, ఈవివి గారి అనిల్ శ్రీను వైట్ల గారి అనిల్ రావిపూడి గారి సినిమాలు ప్రేక్షకులుని ఎంతగానో అలరిస్తాయి . డి కూడా అచ్చ తెలుగు కామెడీ ఎంటర్టైనర్. సెప్టెంబర్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నమ్మకంతో థియేటర్‌కి రండి. థియేటర్ నుంచి బయటికి వెళ్లినప్పుడు మీరు ఫుల్లుగా నవ్వుకుంటూ వెళ్తారు. దానికి నేను గ్యారెంటీ. ఈ సినిమా కావాల్సిన అతిపెద్ద ప్రమోషన్ మౌత్ పబ్లిసిటీ. ఆ ప్రమోషన్ మీరే ఇవ్వాలి. సక్సెస్ మీట్‌లో టీమ్ అందరి గురించి మాట్లాడుతాను.
విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ఇది సక్సెస్‌ఫుల్ ఫిలిం. మా టీమ్ అందరికీ థాంక్యూ. చేతన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా నిర్మాతలకు థాంక్యూ. నరేష్ గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.
రాశి సింగ్ మాట్లాడుతూ.. ఇందులో రంభ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా తీశారు. రాజేష్ గారికి, ప్రసాద్ గారికి, అన్నపూర్ణ స్టూడియోస్‌కి థాంక్యూ. నరేష్ గారితో మరోసారి కలిసి నటించాలని ఉంది. మా టీమ్ అందరికీ థాంక్యూ. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు.
ప్రిషా సింగ్ మాట్లాడుతూ.. ఇందులో మేనక క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. ఇంత పెద్ద సినిమాతో, అన్నపూర్ణ స్టూడియోస్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నరేష్ గారితో నటించడం చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా మ్యూజిక్ టీమ్‌కి థాంక్యూ. డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ జానర్. సినిమా అద్భుతంగా వచ్చింది. నరేష్ గారికి అద్భుతమైన ఫన్ టైమింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.

